»Game Changer Shankar Another Big Shock For Game Changer
Game Changer: గేమ్ చేంజర్‌కు శంకర్ మరో బిగ్ షాక్?
స్టార్ డైరెక్టర్ శంకర్ మరోసారి గేమ్ చేంజర్‌కు షాక్ ఇచ్చాడా? అంటే, అవుననే వినిపిస్తోంది. ఒకేసారి కమల్ హాసన్‌తో ఇండియన్ 2, రామ్ చరణ్‌తో సినిమాలు చేస్తున్న శంకర్.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కూడా ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట.
Game Changer: వాస్తవానికైతే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో ఆర్సీ 15 స్టార్ట్ అయినప్పుడు శంకర్ చేతిలో ఇదొక్కటే ప్రాజెక్ట్ ఉంది. కానీ అనుకోకుండా మధ్యలోకి దూసుకొచ్చింది ఇండియన్ 2. అప్పటి నుంచి గేమ్ చేంజర్ డిలే అవుతునే ఉంది. ఈ సినిమా మొదలు పెట్టి రెండేళ్లు దాటిన పెద్దగా అప్డేట్స్ లేవు. అప్పుడెప్పుడో ఒక మోషన్ పోస్టర్ ద్వారా టైటిల్ మాత్రమే రివీల్ చేశారు. మళ్లీ ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. ఇప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. కానీ మొన్నామధ్య నిర్మాత దిల్ రాజు మాత్రం సెప్టెంబర్‌లో గేమ్ చేంజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. అయితే లేటెస్ట్ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చేలానే ఉంది.
లేటెస్ట్గా.. ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా సమాచారం. దీంతో నెక్స్ట్ శంకర్ ఫోకస్ మొత్తం గేమ్ ఛేంజర్ పైనే ఉంటుందని అనుకుంటున్నారు. కానీ కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇండియన్ 3ని కూడా స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడట శంకర్. చాలా రోజులుగా ఇండియన్ 2 లెంగ్త్ ఎక్కువగా రావడంతో.. ఇండియన్ 3 కూడా చేయాలని శంకర్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి.. రెండు సీక్వెల్స్ పనులను ఒకేసారి కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట శంకర్.
ఇండియన్ 3కి ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్‌లో ఉందట. అందుకే.. ఇండియన్ 3 కోసం జనవరి నెల లాస్ట్ నుంచి 30 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట కమల్ హాసన్. ఒకవేళ ఇదే నిజమైతే.. గేమ్ చేంజర్ సినిమా మరింత లేట్ అవడం పక్కా. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ విషయంలో చాలా నిరాశగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు శంకర్ ఇండియన్3 అంటే మాత్రం.. ఇప్పట్లో గేమ్ చేంజర్ రావడం కష్టమే!