»Before Shruti Marathe Janhvi Kapoor Too Cant Workdevara
Devara: ఆమె ముందు.. జాన్వీ కపూర్ కూడా పనికి రాదా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు దేవరలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ బ్యూటీ ముందు జాన్వీ కపూర్ కూడా పనికి రాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Before Shruti Marathe.. Janhvi Kapoor too can't work?Devara
Devara: జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న దేవర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అనుకోకుండా దేవర షూటింగ్లో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు గాయాలు అవడం.. ఏప్రిల్‌లో ఏపి ఎలక్షన్స్ ఉండడంతో దేవర వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ. బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసిన రాని స్టార్ డమ్ దేవర మూవీతో వస్తుందని జాన్వీ గట్టిగా నమ్ముతోంది. అయితే.. దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ను డామినేట్ చేసేలా మరో హీరోయిన్ కూడా నటిస్తుందనే న్యూస్ వైరల్‌గా మారింది. గుజరాతి నటి, ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్టనేకర్ భార్య శృతి మరాఠే.. దేవరలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ అందుకుందని సమాచారం.
దేవర సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో మరో హీరోయిన్గా శృతి మరాటేను తీసుకున్నారా? లేదంటే, మరేదైనా పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించనుందా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ బ్యూటీని దేవర ఫైనల్ చేశారనే టాక్ రావడంతో.. నందమూరి అభిమానులంతా ఆమె ఎలా ఉందంటూ? ఆరా తీసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అమ్మడిని చూసిన తర్వాత జాన్వీకపూర్ కంటే బాగుంది.. ఇంకా హాట్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమాలో ఈ బ్యూటీ జాన్వీని డామినేట్ చేయడం పక్కా అంటున్నారు. మరి దేవరలో హీరోయిన్లు ఎలా ఉంటారో చూడాలి.