2009లో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్’ సెన్సేషన్‌గా నిలవడంతో.. వరుస సీక్వెల్స్ ప్రకటించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఫస్ట్ సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో అవతార్ 2(Avatar 2) పై ఎక్కడ లేని అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ అదిరిపోయేలా ఉండడం.. అంచనాలను రెట్టింపు చేసింది. అందుకే ఏకంగా 160 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అవతార్2 బిజినెస్ ఊహించని విధంగా జరుగుతోందని తెలుస్తోంది.
ట్రేడ్ వర్గాల ప్రకారం ఒక్క తెలుగులోనే 100 కోట్లు కోట్ చేశారని తెలుస్తోంది. 100 కోట్లంటే ఇంచు మించు మన తెలుగు స్టార్ హీరోల సినిమా రేంజ్ అన్నమాట. పాన్ ఇండియా సినిమాలు తప్పితే టాలీవుడ్ సినిమాలకు కూడా 100 కోట్ల బిజినెస్ జరగడం లేదు. కానీ ఓ హాలీవుడ్ డబ్బింగ్ మూవీకి అన్ని కోట్లు పెట్టాలంటే.. ఆలోచించాల్సిన విషయమే. పైగా ఇప్పుడున్న టికెట్ రేట్లు భయపెడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు డిస్ట్రీబ్యూటర్స్ అవతార్2 విషయంలో వెనకడుగు వేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
అయితే మరో వెర్షన్ ప్రకారం.. తెలుగు రైట్స్ కోసం స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. 100 కాదు 120 కోట్లు కూడా పెట్టేందుకు రేడీ అవుతున్నట్టు టాక్. ఇద్దరు ముగ్గురు కలిసి అవతార్ 2 తెలుగు రైట్స్‌ను దక్కించునే ప్లాన్‌లో ఉన్నారట. అవతార్ క్రేజ్‌తో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని.. అందుకే భారీగా ఇచ్చేందుకు సై అంటున్నారట. మరి ఫైనల్‌గా అవతార్2 తెలుగు రేటు ఎంతకు ఫిక్స్ అవుతుందో చూడాలి.