జేమ్స్ కామెరూర్ అద్భుత సృష్టి ‘అవతార్ 2’ని వెండితెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు మూవీ లవర్స్. డిసెంబర్ 16న ఈ సినిమా దాదాపు 160 భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2009లో అవతార్ సృష్టించిన ప్రభంజనం కంటే డబుల్ డోస్ ఇవ్వబోతోంది అవతార్ 2.
ఇప్పటికే రిలీజ్ అయిన ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ ట్రైలర్స్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఈ విజువల్ వండర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడటానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటు ఇండియాలోనూ ఈ మూవీపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అవతార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
టికెట్ రేట్లు ఎలా ఉన్నా బుకింగ్స్ కోసం పోటీ పడుతున్నారు జనాలు. దాంతో డిసెంబర్ 16 దరిదాపుల్లో మరో సినిమా రిలీజ్‌కు సాహసం చేయడం లేదు. మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు అని తేడా లేకుండా మెజారిటీ థియేటర్లలో ఈ సినిమానే రిలీజ్ కాబోతోంది. అందుకే.. కాస్త ముందుగానే అవతార్ 2 థియేటర్లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. అవతార్ డిమాండ్ మేరకు పలు సిటీల్లో ముందు రోజు అర్ధరాత్రి అర్ధరాత్రి 12 గంటలకే ‘అవతార్-2’ స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారట.
అలాగే కొన్ని నగరాల్లో 24 గంటల పాటు ఈ సినిమా ప్రదర్శనకు అనుమతులు తీసుకుంటున్నారట. ఫస్ట్ వీకెండ్లో నాన్ స్టాప్‌గా షోలు ప్లాన్ చేస్తున్నారట. ఇదంతా చూస్తుంటే.. ఇప్పటి వరకు ఇలా ఓ హాలీవుడ్ సినిమాలకు మిడ్ నైట్, తెల్లవారుజామున షోలు పడడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. మరి భారీ క్రేజ్‌తో వస్తున్న అవతార్ 2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.