త్రిష.. ఏ మాయ చేసిందో, ఏ మంత్రం వేసిందో తెలియదు గానీ.. బడా బడా హీరోలంతా ఆమె వెంటే పడుతున్నారు. అసలు నాలుగు పదుల వయసులోను పాతికేళ్ల హీరోయిన్ల త్రిష ఎలా కనిపిస్తోంది? అనేదే మిగతా హీరోయిన్లకు అంతు పట్టడం లేదు. అమ్మడి గ్లామర్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. ఈ బ్యూటీ అందమే తింటోందా? అనేలా.. క్యూట్ లుక్‌తో కట్టిపడేస్తోంది. అందుకే త్రిషకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది అమ్మడు.
ఇక త్రిష(Trisha) పనైపోయింది.. అనుకున్న సమయంలో మణి రత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్ 2′(Ponniyan selvan 2 movie)తో అదరగొట్టేసింది చెన్నై చిన్నది. ఇందులో కుందవై అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలో మాజీ విశ్వ సుందరి ఐశర్యరాయ్ కూడా ఉన్నప్పటికీ.. గ్లామర్ పరంగా త్రిషకే ఎక్కువ మార్కులు పడ్డాయి. త్రిషని చూస్తే అందమే తింటోందా.. అసలు రోజు రోజుకి గ్లామర్ పెరుగుతుందే కానీ.. ఏ మాత్రం తగ్గడం లేదు అనిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే.. కెరీర్ స్టార్టింగ్‌లో కంటే ఇప్పుడే అందానికే అసూయ పుట్టేలా ఉంది. ఏం తింటుందో, ఏం చేస్తుందో తెలియదు గానీ.. పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తోంది త్రిష(Trisha).
ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఇప్పుడు మరో భారీ ఆఫర్ అందుకుంది త్రిష(Trisha). పొన్నియన్ సెల్వన్(Ponniyan selvan 2 Movie) తర్వాత నెక్స్ట్ లొక నాయకుడు కమల్ హాసన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు మణిరత్నం. ఈ సినిమాలో మళ్లీ త్రిష(Trisha)ని హీరోయిన్గా ఫైనల్ చేశాడట మణిరత్నం. ఇదేకాదు.. మలయాళంలో మోహన్ లాల్(Mohanlal) సరసన కూడా త్రిష నటించబోతోందట. ఏదేమైనా త్రిష అందానికి మేకర్స్ ఫిదా అయిపోతున్నారని చెప్పాలి.