నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్ర హాయ్ నాన్న విడుదలైన అన్ని చోట్ల మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే దీనిపై పలువురు ప్రముఖులు స్పందించిగా తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్పందనను తెలిపారు. ఇది నాని కెరియర్లో బెస్ట్ ఫిల్మ్ అని తెలిపారు.
Allu Arjun: నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్గా వచ్చిన తాజా చిత్రం హాయ్ నాన్న. యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇది నాని కెరియర్లోనే హైఎస్ట్ ఓపెనింగ్గా నిలిచింది. ఇప్పటికే పలువురు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకోగా తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన రివ్యూను పంచుకున్నాారు.
‘హాయ్ నాన్న’ హృదయానికి హత్తుకుంది. బ్రదర్ నాని తన నటనతో ఆశ్చర్యపరిచారు. ఇంతమంచి స్క్రిప్ట్‌ను అందించిన టీమ్‌కు అభినందనలు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకున్నారు. ఆమె నటన కూడా ఆమెలానే అందంగా ఉంది. ఇక బేబీ కియారా(Baby Kiara) తన క్యూట్‌నెస్‌తో ప్రేక్షకుల మనసులు దోచేసిందన్నారు. అలాగే ఈ చిత్రం కోసం పనిచేసిన టెక్నిషియన్స్, ముఖ్యంగా కెమెరా మ్యాన్ పనితీరు బాగుంది. దర్శకుడు శౌర్యువ్ తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. భావోద్వేగంతో కన్నీళ్లు తెప్పించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం చాలా బాగుందని ఇలాంటి మరెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కేవలం నాన్నల హృదయాలనే కాదు.. కుటుంబంలోని అందరి మనసులనూ హత్తుకుంటుంది’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు నాని సైతం రిప్లై ఇచ్చారు. ‘‘ధన్యవాదాలు బన్నీ. మంచి సినిమాను ప్రోత్సహించడంలో మీరెప్పుడూ ముందు వరుసలో ఉంటారు’’ అని పేర్కొన్నారు.
Congratulations to the entire team of #HiNanna . What a sweet warm film . Truly heart touching. Effortless performance by brother @NameIsNani garu . And my respects for green lighting such captivating script and bringing it into light . Dear @Mrunal0801 . Your sweetness is…