ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. జనతా గ్యారేజ్ తర్వాత సెట్ అయిన కాంబినేషన్ కావడంతో.. దేవరపై భారీ అంచనాలున్నాయి. తాజాగా దేవర2 అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సినిమాల అప్డేట్ ఉన్నా లేకున్నా..ట్విట్టర్ టాప్ ట్రెండింగ్‌లో ఉండే హీరో ఎవరైనా ఉన్నారా అంటే, అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. గతకొన్ని రోజులుగా దేవర టీజర్ గురించి ట్రెండ్ చేస్తునే ఉన్నారు. టీజర్ ఎప్పుడు వస్తుంది? అంటూ ఎన్టీఆర్, దేవర హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో దేవర సెట్స్‌కి ప్రశాంత్ నీల్ వెళ్లాడు అనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేసింది. తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చే ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ 31 సినిమా స్టార్ట్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల ప్రశాంత్ నీల్ దేవర సెట్స్‌కి వెళ్లాడనే విషయం బయటకి రావడంతో.. తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగానే.. దేవర పార్ట్ 2కి సంబంధించిన మరో న్యూస్ హల్చల్ చేస్తోంది. బౌండరీస్ అన్ని దాటి దేవర సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అయితే దేవర2 ఎప్పుడుంటుందనే విషయంలో క్లారిటీ లేదు గానీ.. లేటెస్ట్ న్యూస్ మాత్రం వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ పీక్స్‌లో ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో ఎన్టీఆర్ లుక్ ఊరమాస్‌గా ఉంటుందట.
ఈ ఎపిసోడ్ సముద్రం మధ్యలో ఉండే ఐలాండ్‌లో భారీ యాక్షన్‌తో సాగుతుందని తెలుస్తోంది. దేవర పార్ట్ 2 కూడా ఈ దీవి బ్యాక్ డ్రాప్లోనే నడుస్తోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కొరటాల కూడా ఓపెనింగ్ రోజు కోస్టల్ ఏరియాలో జరిగే మృగాల వేట మామూలుగా ఉండదని చెప్పాడు. కాబట్టి.. దేవర అంచనాలకు మించి ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.