యానిమల్ వసూళ్లు చూస్తే.. అరాచకం అనే చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన 10 రోజులు అయినా కూడా ఏ మాత్రం స్లో అవ్వడం లేదు యానిమల్. పది రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది యానిమల్.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర యానిమల్ ర్యాంపేజ్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవాల్సిందే. ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమా అయినా సరే.. ఫస్ట్ వీక్కి దాదాపుగా స్లో అవుతాయి. కానీ యానిమల్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్‌ని రాబడుతుంది. మొదటివారం వరల్డ్ వైడ్‌గా 563 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టిన యానిమల్..సెకండ్ వీక్ స్టార్ట్ అయిన రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది రోజుల్లో ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కొత్త బెంచ్ మర్క్ సెట్ చేసిన యానిమల్.. 9వ రోజు కూడా అదిరిపోయే ఫిగర్‌ని నమోదు చేసింది. ఎనిమిదవ రోజు రూ.600 కోట్ల మార్క్‌ని టచ్ చేస్తే.. 9వ రోజు ఎండ్ అయ్యే టైమ్‌కి రూ.660 కోట్లని కలెక్ట్ చేసింది. ఇక పది రోజుల్లో రికార్డ్ రేంజ్ వసూళ్లను కలెక్ట్ చేసింది. పదో రోజు కూడా రూ.37 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మొత్తంగా సెకండ్ వీకెండ్లోనే రూ.87 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది.
అలాగే ఓవర్సీస్లో 22 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ‘యానిమల్’ మూవీ పది రోజుల్లో రూ.432 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో పాటు రూ.710 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టుగా తెలుస్తోంది. మౌత్ టాక్ సాలిడ్‌గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టే.. యానిమల్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ కొట్టాడు. హీరోగా నటించిన రణ్బీరు కపూర్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్గా నటించిన రష్మిక కూడా అదరగొట్టింది. ముఖ్యంగా మరో కీ రోల్ ప్లే చేసిన హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రికి ఈ సినిమాతో మంచి స్టార్ డమ్ అందుకుంది. మరి లాంగ్ రన్లో యానిమల్ ఎంత రాబడుతుందో చూడాలి.