»Salaar Censor Complete Get Ready For %f0%9d%90%80ction Drama
Salaar: సెన్సార్ కంప్లీట్..’𝐀’ction డ్రామాకు సిద్ధంగా ఉండండి!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 22న సలార్ థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో సలార్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఊహించని సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ వారు.
'Salaar' Censor Complete.. Get Ready for '𝐀'ction Drama
సలార్.. ఈ పేరు వింటేనే ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. బాహుబలి తర్వాత తమ దాహం తీర్చే సినిమా సలార్ అని.. అనౌన్స్మెంట్ రోజే ఫిక్స్ అయిపోయారు. ఇక కెజియఫ్ చాప్టర్ 2 చూసిన తర్వాత సలార్ అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ప్రభాస్ లుక్, ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ టాప్ లేచిపోవడం పక్కా అనుకున్నారు. అయితే ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ చూస్తే.. సలార్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే సలార్ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ సభ్యులు సలార్ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేశారు.
ఇదే విషయాన్ని కన్ఫార్మ్ చేస్తు.. డిసెంబరు 22 నుంచి థియేటర్లలో ‘𝐀’ction డ్రామా కోసం సిద్ధంగా ఉండండి.. అంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. ‘ఏ’ సర్టిఫికెట్ అంటే.. సలార్ మాస్ జాతర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. యాక్షన్ డ్రామా, హింస ఎక్కువగా ఉంటేనే ‘ఏ’ సర్టిఫికేట్ ఇస్తారు సెన్సార్ వారు. ప్రస్తుతం థియేటర్లో దూసుకుపోతున్న ‘అనిమల్’ సినిమా కూడా ‘ఏ’ రేటెడ్ మూవీగానే రిలీజ్ అయింది. ఇప్పుడు సలార్ కూడా అలాగే రాబోతోంది. కాబట్టి.. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి చేయబోయే ఊచకోతను ఊహించడం కష్టమే అంటున్నారు.
ఇక సలార్ రన్‌టైమ్ 2 గంటల 55 నిమిషాలుగా లాక్ చేశారు. ఫైనల్‌గా సలార్ సెన్సార్ రిపోర్ట్, రన్‌టైమ్ వివరాలు బయటకు రావడంతో పండగ చేసుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సలార్ క్రేజ్ పీక్స్‌లో ఉంది కాబట్టి.. అర్ధరాత్రి 12 గంటల నుంచే ఫస్ట్ డే ఫస్ట్ షోలు స్టార్ట్ కానున్నట్టుగా చెబుతున్నారు. కచ్చితంగా ఇప్పటివరకున్న ఫస్ట్ డే ఓపెనింగ్స్ అన్నింటినీ సలార్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మరి డిసెంబర్ 22న సలార్ రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.