»After Rajamouli Are There Telugu Directors Of That Range
Rajamouli తర్వాత ఆ రేంజ్ తెలుగు దర్శకులేరీ?
తెలుగు సినిమా చరిత్రకు ఇంతవరకు ఎంత గొప్ప పేరున్నా.. ఆఫ్టర్ రాజమౌళి, బీఫోర్ రాజమౌళి అనే ముద్రవేశారు దర్శకదిగ్గజుడు. ఇన్ని సంవత్సరాలుగా ఆయన రికార్డులను ఆయనే తిరగరాస్తున్నారు కానీ మరే దర్శకుడు రాజమౌళి స్థానాన్ని చేరుకోవడం లేదు. ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆ మార్క్‌ను టచ్ చేస్తున్నారు.
After Rajamouli, are there Telugu directors of that range?
Rajamouli: తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli). ప్రపంచం గర్వించే ఆస్కార్ వేదికపై తెలుగోడి సత్తా చాటాడు. పరిశ్రమలో రాజమౌళి ఆరంగెట్రం ఒక శకం అని చెప్పుకోవచ్చు. మొదటి సినిమా స్టూటెండ్ నెం.1 నుంచి మొన్నటి ఆర్ఆర్ఆర్(RRR) వరకు అపజయం ఎరుగని డైనమిక్ డైరెక్టర్ జక్కన్న. తెలుగులో మొదటి హై బడ్జెట్ మూవీ మగధీర, రామ్ చరణ్‌కు అంత మార్కెట్ లేకపోయినా కేవలం రాజమౌళి అనే బ్రాండ్‌తో దాదాపు రూ. 45 కోట్లను పెట్టారు నిర్మాత అల్లు అరవింద్. తరువాత అంతే స్థాయిలో రూ. 200 కోట్లు పెట్టి బాహుబలి ది బిగినింగ్ తెరకిక్కెస్తే బాక్స్ ఆఫీస్ కళ్లు తిరిగే కలెక్షన్లను వసుళ్ చేసింది. అంతే స్థాయిలో రూ. 350 కోట్లు పెట్టి బహుబలి ది కన్‌క్లూజన్ చిత్రకరిస్తే టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలే ఎన్నడు చూడను వసుళ్లతో బీభత్సం సృష్టించింది. కనివిని ఎరుగని రీతిలో రూ. 1000 కోట్ల గ్రాస్‌ను దాటింది. తరువాత మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన పిరియాడిక్ డ్రామా ఆర్ఆర్ఆర్ మూవీ పాన్ ఇండియా రేంజ్‌ను దాటి ప్రపంచ దేశాల్లో సత్తా చాటింది. ఫలితంగా రూ. 1500 కోట్లను రాబట్టింది. ఇప్పుడు మరో అడ్వెంచర్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో తెరకెక్కిస్తున్నారు. దీని ఫలితం ట్రెడ్ పండితుల ఊహకే వదిలేయవచ్చు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జక్కన్న మార్క్‌ను దాటే మరే తెలుగు దర్శకుడు ముందుకు రావడం లేదు.
మొదటి సినిమాతో హిట్ కొట్టిన సుజిత్ తన రెండవ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కాంబినేషన్లో తెరకెక్కించాడు. అది అనుకున్నంత ఆడలేదు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప ది రైజ్ 500 కోట్లను దాటింది. అది అనుకోకుండా అయిన విజయం అని స్వయంగా సుకుమారే చెప్పారు. ఇక తెలుగులో పెద్ద డైరెక్టర్ల లిస్ట్‌లో ఉన్న త్రివిక్రమ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమానే చేయలేదు. గుణశేఖర్ శాకుంతలం తెరకెక్కించినా అది పెద్దగా ఆడలేదు. ఈ సమయంలో కన్నడ పరిశ్రమ నుంచి ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రాలు మంచి విజయాలు సాధించి వెయ్యి కోట్ల క్లబ్లో చేరాడు. తరువాత తమిళ దర్శకుడు అట్లీ షారుక్ ఖాన్‌తో జవాన్ తీసి రూ. 1000 కోట్ల మార్క్ దాటాడు. ప్రస్తుతం ఈ రేసులో తెలుగు నుంచి సందీప్ రెడ్డి వంగా, నాగ అశ్విన్ ఉన్నారు అని చెప్పవచ్చు. మరి ఈ దర్శకులు అన్నా రాజమౌళిని చేరుకుంటారో లేదో చూడాలి.