Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా ఓ ఇంటర్వూలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదస్పదంగా ఉండే కంగనా పెళ్లిపై తనకు ఉన్న అభిప్రాయాన్ని ఇంటర్వూలో తెలిపింది. ప్రతి అమ్మాయి తన పెళ్లి, కుటుంబం గురించి కలలు కంటుంది. పెళ్లి చేసుకుని కుటుంబంతో సంతోషంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. నేను వాళ్లలాగే కోరుకుంటాను. కుటుంబ వ్యవస్థను ఎంతో గౌరవిస్తాను.పెళ్లి చేసుకుని నాకంటూ ఓ కుటుంబం ఉండాలని నాకు ఉంది. వచ్చే ఐదేళ్లలో ఇదంతా జరుగుతుంది. అందులోనూ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితే ఇంకా బాగుంటుందని చెప్పింది.
గతంలో ఉన్న రిలేషన్ గురించి చెబుతూ.. సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకేలా ఉంటాయని అనుకోకూడదు. రిలేషన్షిప్లో అందరూ విజయం సాధించలేరు. తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో విఫలమయ్యాను. దీని వల్ల మంచే జరిగింది. ఎందుకంటే ప్రేమలో ఉన్నట్లయితే ఎక్కువ సమయాన్ని దానికి కేటాయించాలి. అదృష్టం కొద్ది ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. దేవుడు రక్షించాడు. ప్రేమ విఫలం కావడం వల్ల జీవితంలో జరిగే ప్రయోజనాలని చాలామంది లేటుగా తెలుసుకుంటారని తెలిపింది.
తేజస్ చిత్రంలో కంగనా భారత వాయుసేన పైలెట్‌గా కనిపించనుంది. 2016లో భారత వైమానిక దళం క్షేత్రస్థాయి పోరాట విధుల్లోకి మొదటిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన ఘటన ఆధారంగా సినిమా రూపొందించారు. ఈ కథకి కంగనా అయితేనే బాగుంటుందని డైరక్టర్ ఇటీవల ఓ ఇంటర్వూలో తెలిపారు. ఆ పాత్రకు కంగనా పూర్తి న్యాయం చేసిందని తెలిపారు.