ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పరిధిలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న బెల్లంపల్లి రేంజ్లో పెద్దపులి సంచారం నేపథ్యంలో మొర్రిగూడ, చిన్న అరటిపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిర్యాణి FRO శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పులి కదలికలపై సమాచారం ఉంటే వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.