KMM: మధిర మండలంలోని రొంపిమల్ల ఎస్సీ కాలనీలో సాగుతున్న అక్రమ మట్టి క్వారీపై ఇవాళ గ్రామస్థులు రహదారిపై ధర్నాకు దిగారు. ఇళ్ల మధ్యే 50 అడుగుల లోతులో గుంతలు తవ్వి మట్టి తరలిస్తుండటంతో నివాసాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల వల్ల పశువులు, చిన్నపిల్లల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆరోపిస్తూ లారీలను అడ్డుకున్నారు.