టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ ‘కిష్కింధపురి’. హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ OTTలోకి రాబోతుంది. జీ5లో ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న సాయంత్రం జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. కాగా, కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ మూవీ SEP 12న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.