KKD: పంటలు సాగు చేసే రైతులు ఈ నెల 25వ తేదీలోపు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని పిఠాపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి. స్వాతి తెలిపారు. అన్నదాత సుఖీభవ, పంటల భీమా, పంట నష్టపరిహారం వంటి పథకాలు ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికే వర్తిస్తాయని వివరించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా చేపట్టే ధాన్యం కొనుగోలుకు కూడా పంట నమోదు తప్పనిసరని తెలిపారు.