BHNG: రాజాపేట మండలం సోమారానికి చెందిన విద్యార్థులు కొలనుపాక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. శుక్రవారం ఉదయం బస్సు రాకపోవడంతో గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు కాలేజీ విద్యార్థులు, మరో ఇద్దరు ఇతరులు ఆటో ఎక్కారు. కొలనుపాక గ్రామ పరిధిలో ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.