NLR: ఉదయగిరిలోని ఎంఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరుగుతున్న అదనపు తరగతి గదులు, ల్యాబ్, నిర్మాణ పనులను క్వాలిటీ కంట్రోల్ డీఈఈ ఎంవీ మురళీధర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, క్యూరింగ్ బాగా చేయాలని, పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.