నటి మెహ్రీన్ అర్ష్ ఔలఖ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అతని గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అతని ఇన్స్టా ఖాతా ప్రైవేట్లో ఉండగా, కేవలం 530 మంది ఫాలోవర్లు ఉన్నారు. బయోలో కార్స్, ట్రావెల్స్, స్పోర్ట్స్ అని ఉండటంతో అతను ఒక వ్యాపారవేత్త లేదా క్రీడా ప్రేమికుడు అయి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.