అక్కినేని నాగార్జున, నటి టబు జోడీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జోడీ మరోసారి వెండితెరపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న ‘కింగ్ 100’ మూవీలో ఆమె భాగం కానున్నట్లు సమాచారం. ఇందుకు ఆమె అంగీకరించారట. ఆమెతో పాటు ఈ మూవీలో మరో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నట్లు టాక్.