TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాలని చెప్పారు. తామెంత ఉన్నామో అంత రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆగమాగం రిజర్వేషన్ల జీవో తెచ్చిందని విమర్శించారు.