NZB: కలెక్టరేట్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ శుక్రవారం నిరసన తెలిపారు. కలెక్టరేట్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవడంతో ఆయన్ని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.