CTR: బైరెడ్డిపల్లి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని చెరువులు నిండాయి. ఈ మేరకు బైరెడ్డి పల్లి పెద్ద చెరువు మాత్రం ఎప్పుడెప్పుడు నిండుతుందా అని ఎదురచూస్తున్న వారికి తీపి కబురు అందింది. మరో 3 రోజుల్లో బైరెడ్డిపల్లి పెద్ద చెరువులోకి కృష్ణా జలాలు ప్రవేశించనున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ అధ్యక్షుడు కిషోర్ జలాలు రాక మునుపే ముందస్తుగా లీకేజీ సమస్యలు పరిశీలించారు.