NRML: బీసీలకు న్యాయం జరిగే వరకూ రాజకీయాలకతీతంగా పోరాడుతామని బీసీ సంఘ నాయకులు అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో హైకోర్టు ఎన్నికల స్టే విధించిన నేపథ్యంలో బీసీ సంఘ నాయకులు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీల హక్కుల సాధనకై చేపట్టవలసిన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, కార్తీక్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.