SKLM: ఎచ్చెర్ల IIIT విద్యార్థులు అఖిల భారత విశ్వవిద్యాలయ యోగా ఛాంపియన్షిప్-2025కు ఎంపికై అద్భుత ప్రతిభను చాటారు. అక్టోబరు 8, 9 తేదీల్లో నూజివీడులో జరిగిన అంతర్ కళాశాల యోగా పోటీలలో వీరు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరు నవంబరు 24 నుంచి 28 వరకు బెంగళూరులో జరగనున్న ఫైనల్స్ వెళ్ళనున్నారు.