GNTR: గుంటూరు ఏసీ కాలేజ్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ ఎగ్జిబిషన్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో గుంటూరుకు చెందిన పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించగా, జీఎస్టీ 2.0లోని కొత్త నిబంధనలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు.