PDPL: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ శుక్రవారం బసంతనగర్ అల్ట్రాటెక్ సిమెంట్ క్యాంటీన్‌ను సందర్శించి, కార్మికులతో స్వయంగా మాట్లాడారు. వారి వేతనాలు, సదుపాయాలు మరియు క్షేమ సమాచారాలను తెలుసుకొని సమస్యలను సావధానంగా విన్నారు. పరిశ్రమల స్థిరాభివృద్ధికి కార్మికుల పాత్ర ముఖ్యమని, శ్రమకు తగిన గౌరవం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.