శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రేపు ఉదయం 10:30 గంటలకు జరగాల్సిన జిల్లా కమిటీ సమావేశం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ శుక్రవారం తెలిపారు. జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తరువాత సమావేశం ఎప్పుడన్నది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.