NLG: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన స్టేను గౌరవిస్తామని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ శుక్రవారం తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ను BJP, BRS పార్టీలు కుట్ర పని అడ్డుకున్నాయని విమర్శించారు. తాము బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.