MBNR: జడ్చర్ల మండలం కిష్టారం సమీపంలోని పోతిరెడ్డి చెరువు అలుగు ఉద్ధృతిని దాటే ప్రయత్నంలో అంబఠాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య (68), రాములమ్మ (65) దంపతులు నిన్న సాయంత్రం గల్లంతయ్యారు. సరైన రహదారి లేని కారణంగా కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం బైక్పై సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వసాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.