TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమీక్షించారు. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BJP గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఓట్ల కోసం కాంగ్రెస్, BRS ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటిస్తాం. ఈ ఉప ఎన్నికలో గెలిచి ప్రధాని మోదీకి గిప్ట్గా ఇవ్వాలి’ అని అన్నారు.