GDWL: మల్దకల్ మండలం నేతువానిపల్లి గ్రామంలో ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామ యువకులు మండల విద్యాధికారి (ఎంఈవో) సురేష్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ యువకులు మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలో 100 మంది విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారని తెలిపారు. దీనివల్ల విద్యాబోధన సరిగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.