SRPT: నడిగూడెం మండలం సిరిపురం- శ్రీరంగాపురం గ్రామాల మధ్య రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. చినుకు పడితే రోడ్డు చిత్తడిగా మారుతుందని, కంకర తేలి లోతైన గుంటలు ఏర్పడడంతో, ప్రయాణం నరకంగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి బీటీ రహదారి నిర్మించి తమ ఇబ్బందులు తొలగించాలని శుక్రవారం వాహనదారులు అధికారులను కోరారు.