KDP: ఒంటిమిట్ట మండలం ఎస్సైగా ప్రణయ్ కుమార్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఒంటిమిట్ట ఎస్సైగా మధుసూదన్ రావు పనిచేశారు. ఆయన స్థానంలో నూతనంగా ప్రణయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.