BDK: మణుగూరు BRS పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో మోసం చేస్తూ బీసీ వర్గాలను పక్కన పెట్టే విధానాన్ని కొనసాగిస్తే ఉద్యమాలు తప్పవని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. బీసీల హక్కుల కోసం అవసరమైతే మళ్లీ ప్రజా పోరాటం చేస్తామని అన్నారు.