TPT: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ టీచర్ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. విద్య, కళలు, సాహిత్యం మొదలగు రంగాల్లో అందిస్తున్న విశిష్ట సేవలకు గాను అవార్డు ఇవ్వనున్నారు. నెల 12వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ప్రముఖులచే అవార్డును అందుకోనున్నారు.