ATP: జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ నందగోపాల్(50) ఆకస్మికంగా మృతి చెందారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు పల్స్రేట్ పడిపోవడంతో కుమార్తె వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో దారి మధ్యలోనే మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి పోలీసులు సంతాపం తెలిపారు.