ADB: ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామానికి చెందిన ముక్తాబాయికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. ఈ మేరకు ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ (EMT) అజ్మీర ప్రవీణ్ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పైలట్ రాజేందర్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.