NLG: విద్యార్థుల భద్రతా దృష్ట్యా త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆడిట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గత నెల 4న DVK రోడ్డులో ఉన్న మాస్టర్ మైండ్స్ పాఠశాలలో బస్సు కింద పడి మృతి చెందిన జశ్విత కేసు విషయం బాధాకరమని అన్నారు. స్కూల్లో చదివే విద్యార్థులకు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో మానవతా దృక్పథంతో నోటీసులు జారీ చేసి సీజ్ చేశామన్నారు.