KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేట్లో వరి పంటను వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ పరిశీలించారు. ప్రస్తుత వాతావరణానికి వరిలో మెడ విరుపు తెగులు ఎక్కువగా ఉన్నాయన్నారు. దాని నివారణకు పికాక్జో స్ట్రోబిన్ 7.05%, ప్రోపి కొనజోల్ 11.71% మందులను స్ప్రే చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు సుభాష్, కిష్టన్న, సాయిరాం, గంగాధర్ పాల్గొన్నారు.