KRNL: నగరంలోని 15వ వార్డు బుధవారం పేటలో కాలువ పనులు నిర్లక్ష్యంగా జరుగుతున్నాయని సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు కె. రామకృష్ణ విమర్శించారు. హంద్రీ వెంట ఉన్న కాల్వను పూర్తి చేయకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.