ప్రకాశం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, శుక్రవారం కనిగిరిలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం స్థానిక పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు.