వర్కింగ్ అవర్స్ కారణంగా తాను భారీ మూవీల నుంచి తప్పుకున్నట్లు వస్తోన్న వార్తలపై నటి దీపికా పదుకొనె స్పందించారు. ‘ఒక ఆత్మభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బందిపెట్టే వాటిని అంగీకరించను. ఎన్నో ఏళ్లుగా చాలామంది హీరోలు 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెబితే మొత్తం విషయం తప్పుదోవ పడుతుంది. అందుకే వారి పేర్లు చెప్పాలనుకోవడం లేదు’ అని తెలిపారు.