ఇండస్ట్రీలో తనకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ చెప్పారు. ఇటీవల ‘భూల్ భూలయ్య 3’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన తాజాగా ఇంటర్వ్యూలో.. తాను ఒంటరిగా పోరాడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తనకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చాలన్నారు. వారి సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలనని పేర్కొన్నారు.