ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ 1, 2 మూవీ భారీ విజయం సాధించాయి. త్వరలోనే ‘పుష్ప 3’ రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆమె ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.