రాజస్థాన్ జైపూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ ఫేమ్ నటి, మోడల్ హర్షిల్ కాలియా(30) ప్రాణాలు కోల్పోయింది. పని ముగించుకుని ఇంటికి వెళ్లున్న క్రమంలో షిప్రా పాత్ రోడ్డులో కారు నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టడంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.