TPT: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బాలాజీ కాలేజీ సర్కిల్లోని ఆయన విగ్రహానికి జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ సంస్కరణల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.