»Job Interview Do Not Eat These Foods Before Going To The Interview
Job Interview: ఇంటర్వ్యూకి వెళ్లేముందు ఈ ఫుడ్స్ అసలు తినొద్దు!
ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే ముందుగానే ప్రిపేర్ అవుతారు. డ్రస్సింగ్ నుంచి తినే ఫుడ్ వరకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొన్ని రకాల ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Job Interview: జీవితంలో తొందరగా సెటిల్ కావాలనే ఉద్దేశంతో కొందరు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతుంటారు. ఈ క్రమంలో పరీక్షలు అన్ని ఒక ఎత్తు అయితే చివరి ఇంటర్వూ వారికి ఒక ఎత్తు. ఇంటర్వూ క్రాక్ చేస్తే చాలు.. దాదాపుగా మీకు ఉద్యోగం వచ్చినట్లే. అయితే కొందరు ఇంటర్వూకి వెళ్లినప్పుడు చిన్న తప్పులు చేస్తుంటారు. ఇంటర్వూలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినా.. చిన్న తప్పుల వల్ల ఇంటర్వూలో వెనుకబడిపోతారు. కాబట్టి ఇంటర్వూకి వెళ్లేముందు పూర్తిగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి ఇంటర్వూకి వెళ్లే ముందు దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్వూకి వెళ్లేముందు ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉన్న వంటను తీసుకోవద్దు. వీటివల్ల ఆహారాలకు ఘాటైన వాసన వస్తుంది. ఇవి నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. నోటి నుంచి దుర్వాసన వస్తే మిమ్మల్ని ఇంటర్వూ చేసే వ్యక్తికి మీపై గుడ్ ఇంప్రెషన్ రాదు. కాబట్టి ఇంటర్వూకి వెళ్లే ముందు బ్రష్ చేసుకుని వెళ్లండి. అలాగే వేయించిన, నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇంటర్వూకి ముందు తీసుకోవద్దు. వీటి వల్ల అజీర్ణం, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఇవి మీ కడుపులో రంబ్లింగ్ శబ్దాలను కలిగిస్తాయి. ఇంటర్వ్యూలో యాక్టివ్‌గా ఉండాలని కాఫీ, కెఫిన్ వంటి పదార్థాలు తీసుకోవద్దు. ఇంటర్వూకి వెళ్లే ముందు ఇవి తాగడం వల్ల కొంతమేరకు ఏకాగ్రత దెబ్బతింటుంది. వీటితో పాటు స్వీట్స్, కేక్‌లు, చాక్లెట్స్, క్యాండీలు, కార్బొనేటేడ్ డ్రింక్స్ వంటి చక్కెర అధికంగా ఉండే ఫుడ్స్ తినవద్దు. వీటికి బదులు ప్రొటీన్, ఫైబర్, రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఇంటర్వ్యూలో మీరు యాక్టివ్‌గా ఉంటారు.