»The Cm Jagan Ordered To Collect The Grain Due To The Michaung Effect Of The Storm
Michaung effect: ఆ ధాన్యం సేకరించాలని సీఎం ఆదేశం
ఏపీ రాష్ట్రానికి తుపాను పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు. రైతుల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని దీంతోపాటు పలు శాఖల అధికారులు తుపాను సహాయక చర్యలకోసం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
The CM jagan ordered to collect the grain due to the Michaung effect of the storm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగ్ జాం తుపాను ప్రభావం ఉన్న నేపథ్యంలో సీఎం జగన్(cm jagan mohan reddy) అధికారులను అప్రమత్తం చేశారు. పొలాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ధాన్యం తడిసిపోకుండా వెంటనే మిల్లలు లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆ క్రమంలో ఒకవేళ తేమగా ఉన్నాకుడా రైతుల నుంచి ఆ ధాన్యాన్ని సేకరించాలని అన్నారు. దీంతోపాటు తుపాను నేపథ్యంలో జల వనరుల శాఖ అధికారులు, కార్పొరేషన్, మున్సిపాలిటీలకు చెందిన వారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు వరద(flood) ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీంతోపాటు విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని తిరిగి పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో తుపాను పరిస్థితులు, సహాయక చర్యల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు. ప్రధానంగా తుపాను ప్రభావితం కానున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.