ఓ వ్యక్తి పెట్టే షరతుల వల్ల అమ్మాయిలెవరూ ఆయనతో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. కోట్ల ఆస్తి ఉన్నా ఇప్పటి వరకూ తనకు పెళ్లి కాలేదని ఆ వ్యక్తి ఆవేదన చెందుతున్నాడు.
వందలకోట్ల ఆస్తి ఉన్నా ఓ వ్యక్తికి మాత్రం పెళ్లి కావడం లేదు. తన వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనకు పెళ్లి టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం ఆయనకు 45 ఏళ్లు అయినా ఇంకా వధువు దొరకలేదు. అయితే ఆయన మాత్రం యువకుడిలా కనిపించేందుకు ఏటా రూ.16 లక్షలు ఖర్చు చేస్తూ వస్తున్నాడు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క తిప్పలు పడుతున్నాడు.
కాలిఫోర్నియాకు చెందిన సంపన్నుడు బ్రియాన్ జాన్సన్ (45) పద్దెనిమిదేళ్ల యువకుడిలా ఉండటానికి ప్రతి సంవత్సరం రూ.16 కోట్లు ఖర్చు చేస్తూ వస్తున్నాడు. తనకు తోడు దొరకడం లేదని, అందుకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బ్రియాన్ జాన్సన్‌కు ప్రత్యేకంగా ఓ వైద్యుల బృందమే ఉంది. వారంతా కలిసి ఆయనలో వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.
అందం కోసం రూ.కోట్లు ఖర్చుపెడుతున్న ఈ ధనవంతుడి వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖర్చు పెట్టలేనంత సంపద ఉన్నా ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పెళ్లిచూపుల్లో బ్రియాన్ జాన్సన్ పెట్టిన షరతుల వల్లే ఆయనకు ఇప్పటి వరకూ సరైన భాగస్వామి దొరకడం లేదు.
డేటింగుకు వెళదామనుకొన్నపుడు మొదట తాను రాసుకున్న ఓ లిస్ట్‌ను ఆ అమ్మాయి ముందు ఉంచుతానని, తనకు ఇప్పటి వరకూ ముడుచుకుని పడుకోవడం అలవాటని, భాగస్వామితో ఉన్నప్పుడు అలా ఉండనని, అయితే తాను రోజుకు 111 మాత్రలు వేసుకుంటానని అమ్మాయితో చెబుతాడు. దీనివల్లే తనకు ఇప్పటి వరకూ పెళ్లి కావడం లేదని బ్రియాన్ జాన్సన్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.