US not flying any balloons:ఇప్పుడు చైనా వంతు.. అమెరికా బెలూన్లు అట
US not flying any balloons:అమెరికా (america) అణు స్థావరాలపై బెలూన్లతో డ్రాగన్ చైనా (china) నిఘా పెట్టిందని.. వాటిని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనా వంతు వచ్చింది. తమ గగనతలంలో అమెరికా బెలూన్లు (balloons) కనిపించాయని పేర్కొంది. అమెరికా బెలూన్లు గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 10 సార్లకు (10 times) పైగా వచ్చాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు.
US not flying any balloons:అమెరికా (america) అణు స్థావరాలపై బెలూన్లతో డ్రాగన్ చైనా (china) నిఘా పెట్టిందని.. వాటిని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనా వంతు వచ్చింది. తమ గగనతలంలో అమెరికా బెలూన్లు (balloons) కనిపించాయని పేర్కొంది. అమెరికా బెలూన్లు గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 10 సార్లకు (10 times) పైగా వచ్చాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. అమెరికా పంపిన బెలూన్ల ఉద్దేశం ఏంటో వెన్ బిన్ స్పష్టత ఇవ్వలేరు. ఈ విషయంలో తాము బాధ్యతాయుతంగా వ్యవహరించామని చెప్పారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) ఆదేశాలతో ఆ దేశ రక్షణశాఖ చైనా బెలూన్ను కూల్చివేసింది. దక్షిణ కరోలినా తీరానికి సమీపంలో కూల్చివేయగా.. బెలూన్ శిథిలాల కోసం అట్లాంటిక్ సముద్రంలో గాలింపు చర్యలను చేపట్టారు. తమ అణు స్థావరాలపై బెలూన్లతో డ్రాగన్ నిఘా పెట్టిందని అమెరికా (america) చెబుతుంది. వర్జీనియాలో గల లాంగ్లే ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఫైటర్ ఎయిర్ క్రాప్ట్‌తో క్షిపణిని ప్రయోగించి బెలూన్ను నేలమట్టం చేశారు. అమెరికా గగనతంలో చైనా బెలూన్ నిన్న కలకలం రేపింది. విషయాన్ని రక్షణశాఖ అధ్యక్షుడు దృష్టికి తీసుకొచ్చింది. బెలూన్ కూల్చివేయాలని జో బైడెన్ స్పష్టంచేశారు. కరోలినా తీరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆ ప్రక్రియను చేపట్టారు. దీంతో ఎవరికీ హానీ జరగలేదని పెంటగాన్ పేర్కొంది. తమ ఆపరేషన్‌కు కెనడా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందని తెలిపింది.
బెలూన్ కూల్చివేత అంశంపై అంతకుముందు చైనా (china) గట్టిగా స్పందించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది ఉల్లంఘనేనని తెలిపింది. దీనిపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఆ వెంటనే అమెరికా బెలూన్లు కనిపించాయని చెబుతోంది.